హైదరాబాద్ శివార్లలో ఆరు దశాబ్దాలుగా వీడని అరడకరం భూ వివాదం

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగర శివార్లలోని రెండు జిల్లాల సరిహద్దు గ్రామాల్లో సుమారు 600 ఎకరాల భూమికి సంబంధించి గత ఆరు దశాబ్దాలుగా నడుస్తున్న వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఒక జిల్లా రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ ప్రాపర్టీగా, పొరుగు జిల్లా రికార్డుల్లో ప్రైవేటు పట్టా భూమిగా నమోదై ఉండటంతో వందల కోట్ల విలువైన ఈ భూములపై తీవ్ర గందరగోళం నెలకొంది. రెండు జిల్లాల యంత్రాంగాల సమన్వయ లోపం, రికార్డుల తప్పుల వల్ల తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించడానికి సమగ్ర డిజిటల్ సర్వే నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.