నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బస్టాప్ లేక రోగుల అవస్థలు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందలాది మంది వస్తున్నా నేటికీ సరైన బస్టాప్ ఏర్పాటు చేయలేదు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. తక్షణమే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆసుపత్రి వద్ద బస్టాప్ నిర్మించాలని కోరుతున్నారు.