తిరుమల శ్రీవారికి భక్తురాలి కానుక: రూ.25 లక్షల విలువైన పగడాల హారాలు అందజేత
రిపోర్టర్: నరేష్
స్థలం: తిరుమల
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి హైదరాబాద్‌కు చెందిన కమల అనే భక్తురాలు బంగారంతో చేయించిన సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన రెండు పగడాల హారాలను కానుకగా అందించారని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు దాత తన కుటుంబసభ్యులతో కలిసి రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరికి వీటిని అందజేశారు. మరోవైపు తిరుపతి తిరుమల దేవస్థానానికి చెందిన వివిధ ట్రస్ట్‌లకు ఇరవై లక్షల రూపాయల విరాళాలు అందాయి.