ఓట్ల తొలగింపుపై బీజేపీ నేతకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీగా ఓట్లు తొలగిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకువస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని, రాజ్యాంగ హక్కులను కాపాడుకునేందుకు పోరాటం తప్పదని స్పష్టం చేశారు.