బీసీసీఐపై జాతీయ క్రీడా పాలనా చట్టం ప్రభావంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్న
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
బీసీసీఐ మరియు రాష్ట్ర క్రికెట్ సంఘాలపై జాతీయ క్రీడా పాలనా చట్టం-2025ను ఎందుకు అమలు చేయకూడదో వివరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక వ్యాజ్యాలు, వివాదాలకు తెరదించేందుకు ఈ చట్టం కిందకు బోర్డులను ఎందుకు తీసుకురాకూడదో తెలపాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం బీసీసీఐని కోరింది. ఈ చర్యతో క్రికెట్ వివాదాలన్నీ క్రీడా ట్రిబ్యునల్ కు బదిలీ అయ్యే అవకాశం ఉంది.