నవోదయ విద్యార్థులకు గుడ్ న్యూస్: సూర్యాపేటలో ఉచిత మోడల్ పరీక్ష నిర్వహణ
రిపోర్టర్: సురేష్
స్థలం: सూర్యాపేట
జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం సూర్యాపేటలో ఉచిత మోడల్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు అశోక్ మాస్టర్స్ ట్యుటోరియల్స్ డైరెక్టర్ మడ్డి అశోక్ కుమార్ తెలిపారు. నవంబర్ 08న జరిగే ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు టైమ్ మేనేజ్మెంట్ అలవాటవుతుందని, పరీక్ష భయం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.