చెత్త నుంచి సిరుల పంట: సరుబుజ్జిలిలో సిబ్బందికి ప్రత్యేక అవగాహన శిక్షణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సరుబుజ్జిలి

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం షలంత్రి గ్రామ పంచాయతీలోని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రంలో తడి, పొడి చెత్త నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల్లో వెయ్యి కిలోల వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని, ప్రజల్లో బిన్ బ్యాగ్ విధానంపై విస్తృత చైతన్యం తేవాలని అధికారులు పిలుపునిచ్చారు. పరిశుభ్రతే లక్ష్యంగా విధులు నిర్వహించాలని సూచించారు.