రామాయణం సినిమా: కైకేయి, మంథర పాత్రల పోస్టర్లు విడుదల చేసిన మేకర్స్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం చిత్రం నుంచి మహారాణి కైకేయి, మంథర పాత్రల అధికారిక క్యారెక్టర్ పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసిందని మేకర్స్ తెలిపారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రంలో కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా చద్దా నటిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.