ఈరోడ్ జిల్లాలో దారుణం: నర్స్ హత్య కేసులో సహోద్యోగి అరెస్ట్

రిపోర్టర్: సురేష్ స్థలం: Erode

ఈరోడ్ జిల్లా పెరురై సమీపంలో నర్స్ ఉత్ర హత్య కేసులో సహోద్యోగి ఎం శరవణన్ను పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ డివి కిరణ్ శ్రుతి తెలిపారు. నిందితుడి నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. అక్టోబర్ 15న ఉద్యోగం ముగించుకుని వెళుతున్న ఉత్రను బైక్పై తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారని తెలిపారు.