యాదాద్రిలో జాతీయ సమావేశాల నిర్వహణకు అయ్యప్ప సేవా సమాజం సన్నాహాలు

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 3 మరియు 4 తేదీలలో జరిగే ఈ సదస్సు కోసం భువనగిరిలో జెండా ఆవిష్కరించారు. జాతీయ కార్యదర్శి నాయిని బుచ్చిరెడ్డి, ట్రస్ట్ సభ్యులు ఐత రాములు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొని, దేశవ్యాప్తంగా భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.