అధికారంలో పాతికేళ్ళు: దేశ ప్రజలకే నా సర్వస్వామ్య హక్కులని ప్రధాని మోడీ స్పష్టీకరణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

సీఎం, పీఎంగా పాతికేళ్ల అధికార ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం తనకు ఎంతో ఇచ్చిందని, పౌరులందరికీ తనపై సర్వ హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వడ్నగర్ జ్ఞాపకాలను పంచుకుంటూ, జీవితంలో ఎదురైన కష్టాలే తనకు నిజమైన పాఠాలు నేర్పించాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.