యువతలో హెచ్చతున్న గుండెపోటు ముప్పుపై వైద్య నిపుణుల ఆందోళన

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

యువతలో గుండె సంబంధిత సమస్యలు రెండేళ్లలో పదిహేను శాతం పెరిగాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.రమేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. జన్యుపరమైన కారణాలతో పాటు జీవనశైలి మార్పుల వల్ల చిన్న వయసులోనే గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. వంశపారపర్యంగా గుండె సమస్యలు ఉన్న కుటుంబాల యువత ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని, అత్యాధునిక సాంకేతికతతో ముప్పును ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.