ముప్పై రకాల స్వీట్లతో వినాయక చవితి సందర్భంగా భారీ అన్నదానం

రిపోర్టర్: కిరణ్ స్థలం: కోనసీమ జిల్లా

కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం సిద్ధివినాయకస్వామి ఆలయం వద్ద విభిన్న రీతిలో అన్నదానం నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో ప్రతి విస్తరిలోనూ ముప్పై రకాల స్వీట్లతో పాటు భోజనం వడ్డించారు. సుమారు పదిహేను రకాల మిఠాయిలు తయారు చేయించి భక్తులకు అందజేశారు. భక్తులు స్వీట్లను ఇళ్లకు తీసుకెళ్లేందుకు నిర్వాహకులు ప్రత్యేకంగా కవర్లు పంపిణీ చేయడంతో ఈ కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.