రాజాపేటలో ఘనంగా సామూహిక బోనాల సంబరాలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో ఆదివారం వివిధ కులాల ఆధ్వర్యంలో సామూహిక బోనాల పండుగ ఘనంగా జరిగింది. పెరిక, పద్మశాలీ, రజక కులస్తులు ప్రత్యేకంగా బోనాలు సమర్పించి, గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వానలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మహిళలు డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లారు. పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామానికి చేరుకున్న వారితో రాజాపేటలో సందడి నెలకొంది.