విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీలో రెబెల్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

రిపోర్టర్: సురేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో రాజకీయ కలకలం రేగింది. పెదాడ రమణి కుమారిని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పేర్కొంటూ నామినేషన్ దాఖలు చేయగా, ఇప్పటికే పార్టీ అధికారిక అభ్యర్థినిగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించిన వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి రెబెల్ అభ్యర్థిగా బరిలో నిలిచారని విజాగ్ న్యూస్ వెల్లడించింది. ఈ పరిణామం అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది.