టెన్నిస్ బాల్స్ రీసైక్లింగ్: బాల్బ్యాక్ తో అద్భుతమైన మార్పు తెచ్చిన విద్యార్థి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Texas

టెన్నిస్ కోర్టులో పారేస్తున్న వందలాది పాత బాల్స్ను సేకరించి రీసైక్లింగ్ చేసేందుకు ప్రేమ్ కామాసాని అనే విద్యార్థి 'బాల్బ్యాక్' అనే లాభాపేక్ష లేని సంస్థను ప్రారంభించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. టెక్సాస్కు చెందిన ఈ హైస్కూల్ విద్యార్థి ఆలోచన క్రమంగా విస్తరించి నేడు దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో నెట్వర్క్గా ఏర్పడి లక్షలాది బాల్స్ను పునర్వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.