ఉల్లాస్ కార్యక్రమం ద్వారా తెలంగాణలో తొమ్మిది లక్షల మంది అభ్యర్థులకు పరీక్ష

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad / New Delhi

తెలంగాణతో పాటు చత్తీస్గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఉల్లాస్ నవ భారత్ సాక్షరతా కార్యక్రమం కింద నిర్వహించిన ప్రాథమిక అక్షరాస్యత మదింపు పరీక్షకు తొమ్మిది లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ పరీక్ష అత్యంత విజయవంతంగా ముగిసిందని, దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. విద్య, సాధికారత, పరివర్తన లక్ష్యాలతో దేశవ్యాప్తంగా విద్యా విప్లవం కొనసాగుతోందని స్పష్టం చేశారు.