యుద్ధప్రాతిపదికన వర్షాల సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
రిపోర్టర్: రాజేష్
స్థలం: శ్రీకాకుళం
రాష్ట్రంలో భారీ వర్షాలు, తీవ్ర వాయుగుండం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి ముంపు ప్రాంతాలను, దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. ఈ కష్టసమయంలో ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, క్షేత్రస్థాయిలో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.