ఓట్ల రాజకీయంపై ఓటరు నిరసన: ఇంటి ముందు వినూత్న ఫ్లెక్సీ ఏర్పాటు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
గెలిచిన తర్వాత నాయకులు పార్టీలు మారుతున్న తీరుపై ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన కిరాణ దుకాణదారుడు అర్జునరావు వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మా ఇంటి ఓట్లు అమ్మబడవు అంటూ ఆయన ఇంటి ఎదుట ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గెలిచినా ఓడినా ఐదేళ్లు ఒకే పార్టీలో ఉంటామనే దమ్ముంటేనే ఓట్లు అడగాలని ఆ ఫ్లెక్సీలో ఆయన అభ్యర్థులను సూటిగా నిలదీశారు.