జర్నలిస్ట్ అభ్యంతరకర ప్రశ్నలపై సంపూర్ణేశ్ బాబు కూల్ రియాక్షన్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
ది ప్యారడైజ్ చిత్ర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నటుడు సంపూర్ణేశ్ బాబును సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ హీరో అయ్యేంత నీలో ఏముంది అంటూ అవమానకర రీతిలో ప్రశ్నించడం తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే ఆ ప్రశ్నలపై సంపూర్ణేశ్ బాబు ఎక్కడా ఇరిటేట్ కాకుండా చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు జర్నలిస్ట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాదరణ పొందిన నటుడిపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తగదంటూ విమర్శలు గుప్పించారు.