అర్చక సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజేశ్వర్ శర్మ ఎన్నిక
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
ధూప దీప నైవేద్య అర్చక సంఘం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజాపేటకు చెందిన చలివేదుల రాజేశ్వర్ శర్మ ఎన్నికయ్యారు. హైదరాబాద్ కాచిగూడలోని తుల్జా భవాని ధర్మశాలలో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ ఈ నియామకాన్ని ప్రకటించారు. అర్చకుల వేతనాల సమస్యలు, బడ్జెట్ కేటాయింపులపై సమావేశంలో చర్చించి అధికారులకు వినతిపత్రం అందజేశారు.