రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలనలో ప్రజల జీవితాల్ లోని చీకట్లను తొలగించి కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పండుగ సంబరాల వేళ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, కాలుష్యానికి తావులేకుండా సురక్షిత వాతావరణంలో దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.