విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయవాడ

మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు అన్ని వర్గాలు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విజయవాడలో జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన ఆమె, స్టాళ్లను సందర్శించి చీర కొనుగోలు చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదుగుతుండటం దేశ ఆర్థిక సమృద్ధికి ఎంతో దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.