నెల్లూరులో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి అధికారుల ప్రత్యేక కార్యక్రమాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్‌ఈ మరియు కరెంటోళ్ల జనబాట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎస్‌ఈ సుధాకర్ నేతృత్వంలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అందిన వేలాది ఫిర్యాదులను అధికారులు పరిశీలించి అత్యధిక సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు.