ఢిల్లీలో కలకలం: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ముందస్తు అరెస్ట్

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

ఢిల్లీలో కోక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కన్నాట్ ప్లేస్లో త్రివర్ణ పతాక ఆవిష్కరణ నిరసన ప్రదర్శనకు ముందు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో భాతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ల కింద చర్యలు చేపట్టారు. ఏఐఎస్ఏ చీఫ్ నేహా బోరాను విడుదల చేయగా, కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.