మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నటి ఆకాంక్ష చౌదరి

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

మహిళల భద్రత, వేధింపులు మరియు దుస్తులపై సాగుతున్న విమర్శలపై నటి ఆకాంక్ష చౌదరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటి ఎదుటే జరిగిన వేధింపుల ఘటనపై చుట్టూ ఉన్నవారు స్పందించకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. రాఖీ పండుగ రోజు తాను ధరించిన బట్టలపై జరిగిన ట్రోలింగ్ను ఆమె గుర్తుచేసుకున్నారు. మహిళలను గౌరవించడం కంటే వారి దుస్తుల గురించిన చర్చలే ఎక్కువగా జరుగుతున్నాయని ఆకాంక్ష ఆవేదన వెలిబుచ్చారు.