ప్రతిష్టాత్మక ఆర్యదాన్ ముహమ్మద్ అవార్డుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్రెడ్డి గారు ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డుకు ఎంపికయినట్లు తెలంగాణ సీఎంఓ అధికారికంగా వెల్లడించింది. కేరళకు చెందిన దిగ్గజ నేత, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఈ పురస్కారాన్ని ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతులు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సమాచారం.