కాణిపాకం బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై వైభవంగా స్వామివారి ఊరేగింపు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహనసేవ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర సందర్భముగా మాజీ ఈవో అగరంపల్లి కేశవులు స్వామివారికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, ఉభయదారులు అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపను పొందారు.