'స్థానిక సంస్థల ఎన్నికలపై వైయస్సార్సీపీ సమరభేరి': అనపర్తిలో పార్టీ జిల్లా సమీక్షా సమావేశం
రిపోర్టర్: సతీష్
స్థలం: Anaparthy, East Godavari
అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, పార్టీ పటిష్టతపై కీలక చర్చలు జరిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని నేతలు దిశానిర్దేశం చేశారు.