అప్పులపై సీఎం చంద్రబాబు అబద్ధాలు ఆపాలని తీవ్ర విమర్శ

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి మొత్తం అప్పు రూ.5.19 లక్షల కోట్లేనని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం వైయస్ జగన్ హయాంలో రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారంటూ పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత మంత్రుల ప్రకటనలకు విరుద్ధంగా చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.