మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో భారత్‌లో ఎరువుల తయారీకి ముప్పు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

మధ్యప్రాచ్య దేశాలలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ సప్లై చెయిన్ దెబ్బతిని, భారత్‌లో సల్ఫర్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల రాబోయే రబీ సీజన్‌కు ఎరువుల లభ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో టన్ను సల్ఫర్ ధర రెట్టింపు కావడంతో డీఏపీ, ఎస్ఎస్‌పీ వంటి సంక్లిష్ట ఎరువుల తయారీ వ్యయం భారీగా పెరుగుతోంది. ఒమన్, యూఏఈ, ఖతార్ వంటి దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకునే సల్ఫర్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ కార్యదర్శి డాక్టర్ బీఎస్ ద్వివేది తెలిపారు.