కళాశాల ఖర్చుల కోసం ప్రారంభించి: క్రిస్మస్ చెట్ల వ్యాపారంతో స్నేహితుల అద్భుత విజయం
రిపోర్టర్: రమేష్
స్థలం: Atlanta
అమెరికాలోని అట్లాంటాకు చెందిన జాక్ ఫాట్, కాల్డర్ జాన్సన్ అనే ఇద్దరు స్నేహితులు కాలేజీ ఖర్చుల కోసం పికప్ ట్రక్కుతో ప్రారంభించిన చిన్న క్రిస్మస్ చెట్ల వ్యాపారాన్ని ఏడు ప్రాంతాలకు విస్తరించినట్లు నిర్వాహకులు తెలిపారు. పదేళ్ల క్రితం కేవలం ముప్ పై చెట్లతో మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు వేలాది చెట్ల విక్రయాలతో విజయవంతంగా సాగుతోందని, సమాజ సేవలో భాగంగా విద్యార్థుల కోసం రెండు లక్షల ముప్ పై వేల డాలర్లకు పైగా విరాళాలు అందించినట్లు వారు వెల్లడించారు.