తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూచిపూడి నాట్య నివేదన సమర్పించనున్న సింగపూర్ కళాకారులు
రిపోర్టర్: రాము
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ సందర్భంగా సింగపూర్‌కు చెందిన కూచిపూడి నృత్య కళాకారులు స్వామివారికి నాట్య నివేదన సమర్పించేందుకు తిరుమలకు బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో మరియు శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో సుమారు 45 మంది బృందం ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటోంది. విదేశాల్లో తెలుగు సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ఈ కళాకారులు స్వయంగా తమ ఖర్చులతో భారత్‌కు వచ్చి శ్రీవారి సేవ చేయడం విశేషం.