సంజు శాంసన్ ఎంపికపై మహమ్మద్ కైఫ్ తీవ్ర ప్రశ్నలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బదులు సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వడంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి ఫామ్ లేకుండా నేరుగా జట్టులోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ నిర్ణయం జట్టులో గందరగోళానికి దారితీస్తుందని, మేనేజ్‌మెంట్‌కు ఓపెనింగ్ జోడీపై స్పష్టత లేదని విమర్శించారు.