గిరిజన రైతుల బతుకులను మారుస్తున్న మూడు అంచెల వాడీ వ్యవసాయం

రిపోర్టర్: మహేష్ స్థలం: Adilabad

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ఏజెన్సీ పల్లెల్లో అమలు చేస్తున్న మూడు అంచెల వాడీ వ్యవసాయ విధానం గిరిజన రైతులకు స్థిరమైన లాభాలను తెచ్చిపెడుతోందని నిపుణులు తెలిపారు. ఒకే భూమిలో కూరగాయలు, పండ్ల తోటలతో పాటు గట్ల వెంట కలప చెట్లను సాగు చేయడంతో రైతుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల వరకు పెరిగింది. వ్యవసాయ కుంటలు, బిందు సేద్యంతో సాగు వ్యయం ఆదా అవుతోంది. ఈ ప్రాజెక్ట్ను ఇతర ప్రాంతాలకూ విస్తరించాలని రైతులు కోరుతున్నారు.