టెక్ మార్కెట్లోకి వోబుల్ స్పీడ్ 5జీ ఫోన్: త్వరలో విడుదల
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
భారతీయ మార్కెట్లోకి సరికొత్త వోబుల్ స్పీడ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు వోబుల్ సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది. గతంలో వచ్చిన వోబుల్ వన్ 5జీ ఫోన్‌కు కొనసాగింపుగా వస్తున్న ఈ కొత్త మోడల్, రూ. 20 వేల ధరల శ్రేణిలో లభించనుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆకర్షణీయమైన ఎరుపు రంగుతో పాటు సరికొత్త వృత్తాకార కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుందని టెక్ నిపుణులు పేర్కొన్నారు.