ఖమ్మం జిల్లాలో 120 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

రిపోర్టర్: Narendra kumar kinnera స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యాశాఖ అధికారులు 120 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఎంపికైన వారిలో ఖమ్మం అర్బన్ నుంచి 24 మంది, ఖమ్మం రూరల్ నుంచి 16, చింతకాని నుంచి 13, కల్లూరు నుంచి 8, కారేపల్లి నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. మిగిలిన మండలాల నుంచి కూడా అర్హులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.