పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత: ఎనిమిది దేశాలపై ఇరాన్ జీరో అవర్ వీడియో
రిపోర్టర్: రమేష్
స్థలం: టెహ్రాన్
ఇరాన్ మీడియా విడుదల చేసిన జీరో అవర్ వీడియో మధ్యప్రాచ్యంలో తీవ్ర కలకలం రేపుతోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ తో పాటు జోర్డాన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్ దేశాల్ లోని కీలక లక్ష్యాలపై ఈ వీడియోలో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలు, పెట్రోకెమికల్ కాంప్లెక్సులు, సాంకేతిక సంస్థలు ఈ టార్గెట్ జాబితాలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.