నెల్లూరులో విషాదం: గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

రిపోర్టర్: సునీల్ స్థలం: నెల్లూరు

నెల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై హరిచందన తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్ లో దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.