ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రంగారెడ్డిలో దీపోత్సవం

రిపోర్టర్: సతీష్ స్థలం: Rangareddy

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించి ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.