న్యాయమైన డిమాండ్ల సాధనకై వీఆర్ఏల ఆక్రోశ గర్జన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వేలేరుపాడు

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ వీఆర్ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ మండల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వేలేరుపాడు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు శాంతియుత నిరసన చేపట్టారు. తొమ్మిదేళ్లుగా అరకొర వేతనాలతో ఇబ్బంది పడుతున్నామని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు.