రాచమల్ల ఉపేందర్ కథల్లో మానవ జీవన చిత్రణ స్పష్టమన్న సీతారాం

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా కేంద్రంలోని జెడ్పీ మీటింగ్ హాల్లో అక్షరాల తోవ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో రాచమల్ల ఉపేందర్ రచించిన ఉడికిన మెతుకు, అక్షరానుభూతి పుస్తకాలను కాళోజీ అవార్డు గ్రహీత సీతారాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపేందర్ కథలు మానవ జీవితంలోని అనుభవాలు, సామాజిక పరిణామాలను అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. చుట్టూ జరిగే సంఘటనలను లోతుగా పరిశీలించి రచయిత గొప్ప కథలు సృష్టిస్తున్నారని సీతారాం కొనియాడారు.