కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అడ్డుకోలు
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయవాడ
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలపై నిరసన చేపట్టిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ను పోలీసులు స్టేషన్ గేటు వద్దే అడ్డుకున్నారు. లోపలికి ప్రవేశం లేదంటూ గంటల తరబడి గేటు బయటే నిలబెట్టడంతో ఎమ్మెల్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ఎదురు చూస్తున్నారు.