మిచెలిన్ స్టార్ హోటల్ ఉద్యోగాన్ని వదిలి దుబాయ్ లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Dubai

మిచెలిన్ గైడ్ లో స్థానం దక్కించుకున్న ప్రసిద్ధ హోటల్ ప్రధాన చెఫ్ ఉద్యోగాన్ని వదిలేసి, దుబాయ్ లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెఫ్ ప్రదీప్ ఖుల్లర్ తెలిపారు. ఢిల్లీ శైలి చోలే భటూరే రుచులను విదేశీ గడ్డపై అందిస్తూ ప్రదీప్ ఖుల్లర్ మరియు ఆయన వ్యాపార భాగస్వామి సౌభాగ్య వీర్ భారీ ఆదరణ పొందుతున్నారు. దుబాయ్ లోని ఔద్ మెథా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ చిన్న దుకాణం వద్ద ప్రతిరోజూ వందలాది మంది బారులు తీరుతున్నారు.