ఏపీలో స్థానిక ఎన్నికల నగారా: నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు నామినేషన్లను స్వీకరిస్తామని ఆయన తెలిపారు. నవంబర్ మూడో తేదీన పోలింగ్ నిర్వహించి, ఐదో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల ఎరవై ఒక్క లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు.