సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయవాడ

విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 26కు వాయిదా వేసింది. హైకోర్టులో విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంపై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం పిటిషనర్ న్యాయవాదిని ప్రశ్నించింది. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో, ఆ నిర్ణయం వెలువడిన తర్వాతే తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.