విజయనగరం జిల్లా కలెక్టర్ కారును ఢీకొన్న లారీ: పెను ప్రమాదం తప్పింది

రిపోర్టర్: వెంకట్ స్థలం: Vizianagaram

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును భూషాయవలస పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. అర్నాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, కారులో ఉన్న కలెక్టర్తో పాటు సిబ్బంది అందరూ క్షేమంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆగిపోకుండా వెళ్లిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.