ఓవర్సీస్లో సంచలనం సృష్టిస్తున్న నాని ది ప్యారడైజ్ మూవీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ది ప్యారడైజ్ రిలీజ్కు ముందే ఓవర్సీస్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండగా, ఇప్పటికే ప్రీమియర్స్ కోసం 1.1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను నమోదు చేసింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.