గచ్చిబౌలి హోటల్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ గచ్చిబౌలిలోని డ్రీమ్ ప్రైడ్ హోటల్లో విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. పక్కా సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో ముగ్గురు ఉజ్బెకిస్తాన్ మహిళలతో పాటు నిర్వాహకులు నిఖిల్, రామ్మోహన్ రెడ్డి, విటుడు హర్షిత్ సింఘానియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.