ఖర్గే సభా వేదిక శుద్ధీకరణపై బీజేపీ నేతలపై కేసు నమోదు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Bengaluru
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను అపవిత్రమని భావించి శుద్ధీకరించిన ఘటనపై బెంగళూరు విధాన సౌధ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖర్గే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఈ అవమానకర చర్యకు పాల్పడ్డారని టీఆర్ రామప్ప ఫిర్యాదు చేశారు. ఇది అంటరానితనానికి సంబంధించిన చట్టాల ప్రకారం నేరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.